యూట్యూబ్‌లో దూసుకుపోతున్న “లక్ష్య” ట్రైలర్..!

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న “లక్ష్య” ట్రైలర్..!

Published on Dec 2, 2021 3:00 AM IST


యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా ధీరేంద్ర సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఆర్చరీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్‌లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌కి విశేష స్పందన రావడంతో యూట్యూబ్‌లో ఇప్పటికే 2 మిలియన్ ప్లన్ వ్యూస్‌ని సంపాదించుకోవడమే కాకుండా, 1 లక్షకి పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు కనుక మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే ఓ లుక్కేయండి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు