ఇంటెన్స్ ఎమోషన్స్ తో “లక్ష్య” సాలిడ్ ట్రైలర్.!

Published on Dec 1, 2021 4:08 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తాను ఫిజికల్ గా చాలా కష్టపడ్డా చిత్రం “లక్ష్య”. ఆర్చరీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక్కో అప్డేట్ తో మంచి బజ్ ని సంతరించుకుంది. మరి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుండగా మేకర్స్ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ మంచి ఇంటెన్స్ గా ఉందని చెప్పాలి.

మొత్తం ఆర్చరీ చుట్టూతానే కనిపిస్తూ సాలిడ్ ఎమోషన్స్ లో కనిపిస్తుంది. నాగ శౌర్య లుక్స్ లో డిఫరెన్స్ కానీ సినిమా కోసం తన డెడికేషన్ ని కానీ రీచ్ అయ్యేలానే ఈ ట్రైలర్ లో విజువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే డైరెక్టర్ సంతోష్ టేకింగ్ లో కూడా మంచి సీరియస్ నెస్ కనిపిస్తుంది.

హీరో చుట్టూ గేమ్ కి సంబంధించి ఎక్కడా డీవియేట్ చేయకుండా హీరోయిన్ ఇతర పాత్రలతో ఎమోషన్స్ బాగుండేలా కనిపిస్తుంది. ఇంకా కాల భైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో పర్వాలేదు. ఇంకా ఈ చిత్రంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 10న థియేటర్స్ లో చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :