వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన నాగ శౌర్య “లక్ష్య”

Published on Jan 25, 2022 12:00 pm IST


నాగ శౌర్య హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా వచ్చిన ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇటీవల డిజిటల్ ప్రీమియర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. స్టార్ మా మూవీస్ లో ఈ చిత్రం త్వరలో ప్రసారం కానుంది. జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఏ తరహా విజయం ను సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :