ఆల్ టైమ్ రికార్డు కొట్టిన “లాలా భీమ్లా”

ఆల్ టైమ్ రికార్డు కొట్టిన “లాలా భీమ్లా”

Published on Nov 8, 2021 11:44 AM IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి లాలా భీమ్లా లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట 24 గంటల్లో సౌత్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో యూ ట్యూబ్ లో 10.20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఆల్ టైమ్ టాప్ లో దూసుకు పోతుంది. అదే విధంగా 658 కే కి పైగా లైక్స్ తో ఆల్ టైమ్ సెకండ్ లో నిలిచింది. మొత్తానికి ఈ పాట కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు