చెన్నైలో ‘కాటమరాయుడి’ హవా !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్ర ట్రైలర్ నిన్న రాత్రి విడుదలవగా సినిమా మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి భారీ క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఇదే రేంజ్ క్రేజ్ తమిళనాడులో కూడా ఉందంటే చర్చించాల్సిన విషయమే మరి. ‘కాటమరాయుడు’ చిత్రాన్ని తమిళనాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై 24వ తేదీన నగరంలోని పలు ప్రధాన మల్టీ ప్లెక్సుల్లో పెద్ద సంఖ్యలో షోలు ప్లాన్ చేశారు.

ఒక్క మాయాజాల్ మల్టీ ప్లెక్సులోనే 51 షోలు ప్రదర్శించనున్నారట. అలాగే ఈ చిత్రం యొక్క తమిళనాడు హక్కులు కూడా రూ. 90 లక్షల రికార్డ్ ధరకు అమ్ముడయాయ్యి. అది కూడా తెలుగు వెర్షనే కావడం విశేషం. ఇప్పటి దాకా స్టార్ హీరోలు లేదా పెద్ద చిత్రాల తమిళ డబ్బింగ్ హక్కులు ఎక్కువ ధరకు కొనడం చూశాం కానీ డైరెక్ట్ తెలుగు వెర్షన్ ఇంత ఎక్కువ ధరకు పోవడం ఇదే తొలిసారి.