“లైగర్” షూట్ పై లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్.!

Published on Jun 24, 2022 9:00 am IST

మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అటు హిందీలో గాని మన తెలుగులో గాని భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

మరి షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రమోషన్స్ పై ఫోకస్ చేసిన మేకర్స్ నుంచి ఇపుడు ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పుడు లాస్ట్ సాంగ్ షూటింగ్ కోసం మేకర్స్ సిద్ధం అయ్యారట. మరి ఈ సాంగ్ విజయ్ మరియు అనన్య ల మధ్య ఉండగా ఈ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనితో అయితే ఇక కంప్లీట్ గా సినిమా అయ్యిపోయినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :