ఆఖరి దశలో ‘జనతాగ్యారేజ్’ షూటింగ్

janathagarage1
‘నాన్నకు ప్రేమతో’ తరువాత ఎన్టీఆర్, ‘శ్రీమంతుడు’ తరువాత కొరటాల శివ చేస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే శివ సినిమాను చాలా పర్ఫెక్ట్ గా తయారుచేస్తున్నాడట. ముఖ్యంగా ఇందులోని పాటలు విజువల్ గా ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయని కొరటాల శివ చెప్పనే చెప్పాడు. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, కాజల్ పై తీస్తున్న ‘పక్కా లోకల్’ అనే సాంగ్ షూట్ ఈరోజుతో ముగియనుంది. దీంతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టే.

అలాగే రేపు చిత్ర యూనిట్ కు చివరి వర్కింగ్ డే అని కూడా తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషనల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, సెన్సార్ కూడా 27న జరగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, ఆడియో మంచి స్పందన పొందాయి. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదలకానుంది.