ఆస్కార్‌ బరిలో ఇండియన్ మూవీ “లాస్ట్ ఫిల్మ్ షో”

ఆస్కార్‌ బరిలో ఇండియన్ మూవీ “లాస్ట్ ఫిల్మ్ షో”

Published on Dec 22, 2022 10:00 AM IST

అక్టోబర్ 2022లో, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛెలో షో (లాస్ట్ ఫిల్మ్ షో)ని ఆస్కార్‌ అవార్డుల కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌లో దేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. ఈరోజు, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 10 విభాగాల్లో షార్ట్‌లిస్ట్‌లను వెల్లడించింది. జనవరి 24, 2023న ప్రకటించబడే నామినేషన్లలో చేరిన 15 అంతర్జాతీయ సినిమాలలో లాస్ట్ ఫిల్మ్ షో ఒకటి.

పాన్ నిలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను గెలుచుకుంది. లాస్ట్ ఫిల్మ్ షోలో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్ మరియు పరేష్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సిరిల్ మోరిన్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. విజేతలను మార్చి 12, 2023న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రకటిస్తారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలవడం తో సినిమా ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు