ఊటీలో ‘లాస్ట్ సీన్’
Published on Aug 28, 2018 8:00 am IST

హర్ష కుమార్, తులిక సింగ్ లను హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు దీపక్ బల్దేవ్ తెరకెక్కిస్తున్న చిత్రం లాస్ట్ సీన్. మధునారాయణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో ప్రకాష్ ఠాకూర్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టి వాలీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈసందర్భంగా దర్శకుడు దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే సీటీ లైఫ్ వద్దు అని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం కోసం ఊటీ లో సెటిల్ అవ్వాలనుకునే అబ్బాయి. పల్లెటూరు కంటే సిటీ లైఫ్ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్ చేసి సిటీలో సెటిల్ అవ్వాలి అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అసలు ఆ ప్రేమ నిలబడుతుందా..? అమ్మాయి మాట గెలుస్తుందా.. అబ్బాయి మాట గెలుస్తుందా అసలు ఈ ప్రేమ ఎవరి మాట గెలిపిస్తుంది అనేది ఈ మా “లాస్ట్ సీన్”. అని ఆయన అన్నారు. అనిల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి లో విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook