అక్కడ “ఆర్ఆర్ఆర్” చూసే వారికి చేదు వార్త..!

Published on Mar 29, 2022 3:02 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలను వసూలు చేసి దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యికి పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

అయితే ప్రీమియం ఫార్మాట్ అయిన డాల్బీ విజన్, సినిమార్క్ XD ప్రదర్శనలు అమెరికాలో మొదటి వారం మాత్రమే ఉండనున్నాయట. దీంతో ఈ ఫార్మాట్స్‌లో సినిమా చూడటానికి మరో మూడు రోజులే ఉందని, రెండవ వారం నుంచి సాధారణ ఆర్ఆర్ఆర్ ప్రింట్ ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :