లేటెస్ట్..మళ్ళీ ఆస్కార్ అకాడమీకి సూర్య..డీటెయిల్స్ ఇవే.!

లేటెస్ట్..మళ్ళీ ఆస్కార్ అకాడమీకి సూర్య..డీటెయిల్స్ ఇవే.!

Published on Jun 29, 2022 8:01 AM IST


మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి అతి కొద్దిమంది వెర్సటైల్ స్టార్ హీరోస్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకడు. ఒక హీరోగానే యాంటీ హీరో, విలన్ పాత్రల్లో కూడా అద్భుతంగా రాణించగలిగే ఈ నటుడు రీసెంట్ గా “విక్రమ్” రోలెక్స్ సర్ అంటూ అదరగొట్టాడు. మరి ఈ సినిమాకి ముందు తీసిన మూడు చిత్రాల్లో రెండు ఓటిటి లో రెండు భారీ హిట్స్ అయ్యాయి.

అవే జై భీమ్ మరియు ఆకాశం నీ హద్దురా చిత్రాలు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అయితే సూర్య ఫ్యాన్స్ కాస్త నిరాశ లోనే ఉండగా తాజాగా అయితే మళ్ళీ ఆస్కార్ అకాడమీ నుంచి స్వయంగా సూర్య కి పిలుపు వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఈసారి జరగబోయే 2022 ఆస్కార్ వేడుకకు గాను మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 397 మంది కొత్త ప్రముఖులను పిలవగా వారిలో మన ఇండియన్ సినిమా నుంచి సూర్య కూడా ఒకరు. అలాగే సౌత్ ఇండియన్ సినిమా నుంచి తాను ఒకడే వెళ్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో ఫైనల్ గా సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు