లేటెస్ట్..తన లైఫ్ పార్ట్నర్ ని పరిచయం చేసిన నటి పూర్ణ.!

Published on Jun 1, 2022 12:11 pm IST


సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ హీరోయిన్స్ లో నటి పూర్ణ(షమ్నా కాసిమ్) కూడా ఒకరు. మంచి టాలెంట్ కలిగిన ఈ నటి అనేక సినిమాల్లో కనిపించి మెప్పించింది. అయితే ఇప్పుడు పలు టెలివిజన్ షోలు మరియు సినిమాలతో బిజీగా ఉన్న తాను ఈరోజు తన జీవితంలో మరో కొత్త అధ్యాయం స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించింది.

తాను తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది. దీనితో తన ఇతర నటీనటులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నో మంచి రోల్స్ చేసిన ఈ అండర్ రేటెడ్ హీరోయిన్ తన జీవితంలో తీసుకుంటున్న కొత్త స్టెప్ కి ఆనందం వ్యక్తం చేస్తూ వారి కొత్త ప్రయాణం పట్ల మా 123 తెలుగు బృందం కూడా ఆల్ ది బెస్ట్ చెబుతుంది.

సంబంధిత సమాచారం :