లేటెస్ట్..లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సంజయ్ దత్.!

Published on Jan 31, 2023 3:34 pm IST


ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కించనున్న లేటెస్ట్ చిత్రం “దళపతి 67” కూడా ఒకటి. మరి నిన్ననే అధికారిక అప్డేట్ తో వచ్చిన ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ హైప్ తో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా నుంచి లేటెస్ట్ గా మరో సాలిడ్ అప్డేట్ అయితే బయటకి వచ్చింది.

ఈ చిత్రంలో అయితే మోస్ట్ పవర్ ఫుల్ విలన్ సంజయ్ దత్ నటించనున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేసారు మేకర్స్. మరి సంజయ్ కి లోకేష్ చెప్పిన మొదటి లైన్ తోనే తాను ఈ సినిమా ఒప్పేసుకున్నట్టుగా తాను తెలిపారు. ఆల్రెడి కన్నడ చిత్రం “కేజీయఫ్ 2” లో తన క్రేజీ రోల్ అధీరా గా మనం చూసాము. ఇక ఈ క్రేజీ కాంబోలో తాను ఎలాంటి పాత్ర చేయనున్నారో చూడాలి. మరి ఈ భారీ సినిమా కూడా లోకేష్ కనగ్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒకటిగా వస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 7 స్క్రీన్ స్టూడియో వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :