లేటెస్ట్ : హనుమంతునికి ‘ఆదిపురుష్’ టీమ్ వినయపూర్వకమైన నివాళి

లేటెస్ట్ : హనుమంతునికి ‘ఆదిపురుష్’ టీమ్ వినయపూర్వకమైన నివాళి

Published on Jun 5, 2023 10:00 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలానే కృతి సనన్ సీతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ మైథలాజికల్ జానర్ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించగా టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. జూన్ 16న ఆదిపురుష్ మూవీ గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. రేపు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఎంతో వైభవంగా జరుగనుంది.

కాగా మ్యాటర్ ఏమిటంటే ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అంతటి అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్‌ ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం’ అంటూ హనుమంతునికి వినయపూర్వక నివాళి అందిస్తూ ఆదిపురుష్ టీమ్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు