లేటెస్ట్..”భీమ్లా నాయక్”తో అజిత్ “వలిమై”..?

Published on Nov 27, 2021 2:00 pm IST

ఇక్కడ మన టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే తమిళ్ ఇండస్ట్రీలో థలా అజిత్ లకు ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించిన లేటెస్ట్ సినిమాలు ఎప్పుడు నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్నాయి. పవన్ నటించిన పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” అజిత్ నటించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలిమై” రెండు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఆల్రెడీ పవన్ భీమ్లా నాయక్ జనవరి 12నే అని ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే డేట్ కి అజిత్ మోస్ట్ అవైటెడ్ సినిమా వలిమై కూడా రిలీజ్ కానుంది అని టాక్ బయటకి వచ్చింది.రెండు సినిమాలు ఇతర భాషలు రిలీజ్ కోసం అప్డేట్ లేదు కానీ ఈ ఇద్దరి ఒకే క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు సేమ్ డేట్ కి రిలీజ్ అనే సౌండింగ్ బాగుంది. మరి నిజంగానే ఈ రెండు సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అవుతాయో లేదో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :