షాకింగ్..”అఖండ” హీరోయిన్ కి మళ్ళీ కరోనా పాజిటివ్.!

Published on Oct 10, 2021 1:05 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్ తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు అందుకుంది. మరి తర్వాత కూడా మరిన్ని సినిమాలు కూడా చేసి ఇపుడు నందమూరి నటసింహం బాలకృష్ణ తో “అఖండ” అనే సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ లో కూడా నటించింది.

సినిమా షూట్ ని అంతా కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధమైన వార్తను ప్రకటించాల్సి వచ్చింది. “ఇది పెద్ద ఎగ్జైటింగ్ న్యూస్ మాత్రం అయితే కాదని ఈ ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. ఆల్రెడీ నేను రెండు డోసులు వాక్సిన్ తీసుకున్నా అలాగే ఆల్రెడీ కరోనా వచ్చినా ఇప్పుడు కూడా వచ్చినట్టు కన్ఫర్మ్ చేసింది.

ప్రస్తుతం అయితే నేను ఐసోలేషన్ లో ఉన్నాను, లాస్ట్ 10 రోజుల్లో నన్ను ఎవరైతే కలిసారో వారంతా కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాలని” ప్రగ్యా సూచించింది.” సినిమా అంతా కంప్లీట్ చేసి మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్నపుడు ప్రగ్యా కరోనా బారిన పడడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. మరి ఆమె త్వరగా తిరిగి కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :