లేటెస్ట్..”భీమ్లా నాయక్” రిలీజ్ పై క్రేజీ బజ్.!

Published on Feb 5, 2022 8:01 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న కొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటిస్తున్న “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల మేకర్స్ కూడా క్లారిటీ గానే ఉన్నారు.

ఎప్పుడైతే పరిస్థితులు సెట్ అయ్యితే అపుడే సినిమా రిలీజ్ అవుతుందని అందుకే రెండు డేట్స్ ఇచ్చామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు అయితే ఒక క్రేజీ బజ్ మాత్రం వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే తెలుగు స్టేట్స్ లో ఉన్న నైట్ కర్ఫ్యూ ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి అని అందుకే ఈ వచ్చే ఫిబ్రవరి 25న రిలీజ్ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది.

మరి దీనిపై ఇంకా ఒక అధికారిక క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :