లేటెస్ట్..”ఎన్టీఆర్ 30″ పై ఇంట్రెస్టింగ్ బజ్..!

లేటెస్ట్..”ఎన్టీఆర్ 30″ పై ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on Jan 22, 2022 3:00 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్ అంతే సాలిడ్ గా ఉంది. ఇద్దరు పర్ఫెక్ట్ దర్శకులతో ప్లాన్ చేసుకున్న తారక్ మొదటగా అయితే తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో తన 30వ ప్రాజెక్ట్ ని చేయనున్నాడు.

మరి ఈ సినిమాకి సంబంధించి అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్ని అంచనాలు పెట్టేసుకున్నారు. మరి అవి ఆల్ మోస్ట్ నిజం అయ్యేలానే కనిపిస్తుండగా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాపై ఇప్పుడు వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ భారీ సినిమా లాంచ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి దీనితో ఈ సినిమా హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ పేర్లపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు