“RRR” పై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్.!

“RRR” పై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Nov 30, 2021 8:00 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం”. అనేక అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఓ పక్క హోరెత్తిస్తుండగా ఇంకో పక్క మాసివ్ ట్రైలర్ కట్ ని కూడా రెడీ చేసి సెట్ చేసారు.

అయితే ఇదే క్రమంలో ఓ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఈ చిత్రంపై వినిపిస్తుంది. సినిమాలో అల్లూరి మరియు సీతగా చేసినటువంటి రామ్ చరణ్, ఆలియా భట్ లపై మళ్ళీ చిన్న షూట్స్ చెయ్యాల్సి ఉన్నాయట. అయితే ఇది సినిమాలోని సన్నివేశాలా లేదా ఒక ప్రమోషనల్ సాంగ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే మల్లె ఈ ఇద్దరి మీద షూట్ ఉందనే టాక్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు