“పుష్ప ది రూల్” షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Published on Jan 21, 2022 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “పుష్ప ది రైజ్” హవా ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టోటల్ పాన్ ఇండియన్ వైడ్ ఈ సినిమా విజయం నమోదు అయ్యి సెన్సేషన్ ని రేపింది. దర్శకుడు సుకుమార్ టేకింగ్ కి ప్రతి ఒక్కరు స్టన్ కాగా దీని తర్వాత చెయ్యబోయే పార్ట్ 2 రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా పార్ట్ 2 ని “పుష్ప ది రూల్” గా రిలీజ్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షూట్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. మేకర్స్ అన్నీ సెట్ చేసుకొని వచ్చే ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ చేయనున్నారట. అలాగే ఈసారి సినిమాలో మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ని సుకుమార్ జత చేయనున్నారట.

దీనితో ఈ సినిమా మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :