లేటెస్ట్..ప్రభాస్ “ప్రాజెక్ట్ కె” లో మరో బాలీవుడ్ హీరోయిన్.!

Published on May 8, 2022 10:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కె” కూడా ఒకటి. దీనిని పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా దాదాపు ఇండియన్ టాలెంట్ తోనే తెరకెక్కుతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నుంచి పలువురు బిగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ నటి దిశా పటాని నటించనుందట. దీనిని గాను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తనకి ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారి ఆహ్వానాన్ని పంచుకుంది.

దీనితో ఈ మాసివ్ వరల్డ్ ప్రాజెక్ట్ లో ఈమె కూడా ఫైనల్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఆల్రెడీ కొంతమేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది కానీ ఆ తర్వాత గాని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :