లేటెస్ట్ : ‘అశ్విన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jun 6, 2023 6:30 pm IST

ప్రస్తుతం ఒకప్పటితో పోలిస్తే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్ నుండి బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో రూపొందిన పలు చిన్న సినిమాలు సైతం ఇటీవల రిలీజ్ అతిపెద్ద విజయాలు అందుకున్నవి ఉన్నాయి. ఇక తాజాగా హర్రర్ జానర్ లో రూపొందుతోన్న మూవీ అస్విన్స్. తరుణ్ తేజ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళ ద్విభాషా మూవీ. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వసంత్ రవి, విమలా రామన్, మురళీధరన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

జూన్ 23, 2023న ఈ సినిమాని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈరోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించేందుకు చిత్ర బృందం విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ మరియు ఇతరులు ఈ హర్రర్ థ్రిల్లర్‌లో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాకి విజయ్ సిద్ధార్థ్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :