ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ “అమరన్”

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ “అమరన్”

Published on Nov 30, 2024 12:03 PM IST

మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న తమిళ హీరోస్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒకరు. మరి తాను నటించిన లేటెస్ట్ చిత్రమే “అమరన్”. సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు పెరియసామి తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా వచ్చి తమిళ్ సహా తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో బ్లాస్టింగ్ రన్ ని కొనసాగించగా మేకర్స్ ఓటిటి రిలీజ్ ని అయితే వాయిదా వేశారు.

దీనితో ఈ సినిమా ఓటిటి రిలీజ్ పట్ల మరింత ఆసక్తి నెలకొనగా ఇపుడు ఫైనల్ గా మేకర్స్ సినిమా అఫీషియల్ ఓటిటి రిలీజ్ డేట్ ని అయితే ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్ 5 నుంచి తమిళ్, తెలుగు, సహా హిందీ, కన్నడ మరియు మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి తెస్తున్నట్టుగా మేకర్స్ సహా నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ గా డేట్ ని ఇచ్చేసారు. మరి థియేటర్స్ లో ఎంతో ఆదరణ అందుకున్న ఈ ఎమోషనల్ బయోపిక్ ఓటిటిలో వచ్చాక ఎలాంటి ఆదరణ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు