టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ ఆడియెన్స్ లో క్రేజీ హైప్ ఉన్న ఈ చిత్రం సంబంధించి టీజర్ కోసం చాలా రోజులు నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఇవాళ ఓ సాలిడ్ అప్డేట్ అందిస్తున్నట్టుగా తెలిపారు.
మరి ఫైనల్ గా ఈ అప్డేట్ వచ్చేసింది. అనుకున్నట్టుగా టీజర్ కోసమే రివీల్ చేస్తూ రామ్ బర్త్ డే కానుకగా ఈ మే 15 న డబుల్ ఇస్మార్ట్ క్రేజీ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా పూరి, ఛార్మి లు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.