లేటెస్ట్..ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బెదురులంక 2012”

Published on Sep 22, 2023 7:02 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన డీసెంట్ ఎంటర్టైనర్ చిత్రం “బెదురులంక 2012” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం చాలా కాలం తర్వాత కార్తికేయ నుంచి హీరోగా రాగా దర్శకుడు క్లాక్స్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకునిగా పరిచయం అయ్యాడు.

ఇక ఈ చిత్రం థియేట్రికల్ గా మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు ఓటీటీ లో సందడి చేసేందుకు వచ్చేసింది. మరి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ చిత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు ఎవరైనా ఉంటే ఈ డీసెంట్ ఎంటర్టైనర్ ని ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు అలాగే లౌక్య ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :