క్రేజీ..”చంద్రముఖి 2″ పై బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!

Published on Jun 14, 2022 6:21 pm IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో అప్పట్లో ఇండియన్ సినిమా దగ్గర హారర్ థ్రిల్లర్ గా సెన్సేషన్ ని రేపిన ఈ చిత్రాన్ని దర్శకుడు పి వాసు తెరకెక్కించారు. అయితే భారీ రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ లాంటిది నాగావళ్లి పేరిట కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అయితే అనుకుంటున్న బజ్ ప్రకారం “చంద్రముఖి 2” పై ఆ బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా ప్రొడక్షన్ హౌస్ వారు ఈ చిత్రాన్ని ఇప్పుడు భారీ అనౌన్స్మెంట్ గా తమ బ్యానర్ నుంచి అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోగా మాత్రం రాఘవ లారెన్స్ కనిపించనుండగా స్టార్ కమెడియన్ వడివేలు కొనసాగనున్నారు. అలాగే ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి వర్క్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని కూడా డిజైన్ చేసి రిలీజ్ చేసి పాత చంద్రముఖి గదికి అడ్వాన్స్డ్ వెర్షన్ గా చూపించారు. మొత్తానికి అయితే ఈ క్రేజీ అనౌన్స్మెంట్ తో ఒక్కసారిగా భారీ హైప్ సెట్టయ్యింది. ఇతర వివరాలు రానున్న రోజుల్లో రానున్నాయి.

సంబంధిత సమాచారం :