లేటెస్ట్..షారుఖ్ కొడుక్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్ సి బి.!

Published on May 27, 2022 4:00 pm IST

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి స్టార్ హీరోలలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అయితే షారుఖ్ ఇప్పుడు తన కెరీర్ లో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం అని చాలా కష్టపడుతూ పలు భారీ సినిమాలు చేస్తుండగా ఈ షూటింగ్స్ సమయంలో తనకి ఒక షాకింగ్ వార్త తగిలింది.

తన కొడుకు అయినటువంటి ఆర్యన్ ఖాన్ ఆ మధ్య ముంబై బీచ్ లో రేవ్ పార్టీలలో పాల్గొన్నాడని అలాగే ఆ సమయంలో మాదక ద్రవ్యాలు కూడా తీసుకున్నాడని నెపంతో నార్కోటిక్ సంస్థ వారు ఆర్యన్ సహా చాలా మంది పేరు మోసిన వ్యక్తులనే అరెస్ట్ చేశారు.

అక్కడ నుంచి సెన్సేషన్ గా మారిన ఈ కేసులో ఇప్పుడు ఆర్యన్ కి క్లీన్ చిట్ దొరికినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఎన్ సి బి ఆర్యన్ కి క్లీన్ చిట్ ఇచ్చి అతడిపై ఉన్న ఛార్జ్ షీట్స్ అన్నీ ఎత్తివేసారట. దీనితో ఈ గుడ్ న్యూస్ తో షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :