VD14: డ్యుయల్ రోల్ లో విజయ్ దేవరకొండ?

VD14: డ్యుయల్ రోల్ లో విజయ్ దేవరకొండ?

Published on May 12, 2024 3:00 AM IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం VD14. ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ తో గతంలో టాక్సీవాలా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాహుల్ ఇప్పుడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్‌ ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగించింది.

తాజాగా సోషల్ మీడియా లో వినిపిస్తున్న బజ్ ఏంటంటే, ఈ చిత్రం లో విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ తరహలో డ్యుయల్ రోల్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగే కథ అని పోస్టర్ లో పేర్కొన్నారు. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు