అనుకున్నట్టే “ఆదిపురుష్” రిలీజ్ లేటెస్ట్ బజ్.!

అనుకున్నట్టే “ఆదిపురుష్” రిలీజ్ లేటెస్ట్ బజ్.!

Published on Dec 18, 2022 3:36 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం గాని అన్ని సెట్టయ్యి ఉంటే ఈ చిత్రం జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల చేత అయితే ఈ చిత్రం జనవరి నుంచి జూన్ కి అయితే వాయిదా పడింది.

సినిమాలో కనిపించే విజువల్స్ ని మరింత బెటర్ గా చేసేందుకు గాను మేకర్స్ ప్లాన్ చేస్తుండగా దీనితోనే మళ్ళీ సినిమా వాయిదా అనే మాట మరోసారి బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ బజ్ బయటకి వచ్చింది. ఈ చిత్రం బహుశా జూన్ లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చట.

మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించగా సైఫ్ అలీఖాన్ రావణుని పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు