అజిత్ నెక్స్ట్ పై లేటెస్ట్ బజ్.!

అజిత్ నెక్స్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Feb 6, 2023 9:13 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా “తునివు” తమిళ నాట భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో అజిత్ కెరీర్ లో మరో భారీ హిట్ పడగా ఇక నెక్స్ట్ అజిత్ నుంచి ఎలాంటి సినిమా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే దీనికి గాను అజిత్ తో దర్శకుడు విగ్నేష్ శివన్ సినిమా లాక్ చేయగా అది కాస్తా మళ్ళీ ఆగిపోయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఎవరితో ఉంటుంది అనేది అతి త్వరలోనే తెలియనున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఈ వారం లోనే ఈ సినిమా పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి ఏ దర్శకుడ్ని అజిత్ ఓకే చేశారు అనేది ఆసక్తిగా మారగా ఈ అప్డేట్ కోసం కోలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు