తరుణ్ భాస్కర్ “కీడా కోలా” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Sep 15, 2023 7:02 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అలాగే నటుడు కూడా అయినటువంటి దర్శకుడు తరుణ్ భాస్కర్ చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రమే “కీడా కోలా”. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అలానే పలువురు యంగ్ నటులు నటించిన ఈ చిత్రం టీజర్ తో అయితే మంచి ఆసక్తిని పెంచింది. అయితే థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు సస్పెన్స్ గానే నిలవగా ఈ చిత్రం పై ఎట్టకేలకు ఆ బజ్ వినిపిస్తుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 3న రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అయితే అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. అలాగే విజి సైన్మా వారు నిర్మాణం వహించగా తరుణ్ భాస్కర్ “ఈ నగరానికి ఏమైంది” నిర్మాతలు సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పణలో విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం :