బాలయ్య సినిమా టైటిల్ మారనుందా ?

Balakrishna

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అదే కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త టైటిల్ తెర మీదికి వచ్చింది.

అదే ‘జడ్జిమెంట్’. కథలో బాలయ్య పాత్రకు తగిన టైటిల్ ఇదేనని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దసరా రోజున విడుదలైన పొస్టర్ మీద కూడా టైటిల్ కానీ దానికి సంబందించిన ఎలాంటి క్లూ కానీ లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. షూటింగ్ పూర్తయ్యేలోపు కనీసం టైటిల్ ఏమిటో చెప్పాలని అడుగుతున్నారు.

మరి చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్లో గత ఏడాది ‘జై సింహ’ అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి.

Exit mobile version