బాలయ్య నెక్స్ట్ మాస్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Jan 12, 2022 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆ ఏడాదిలోనే బిగ్హిట్ గానే కాకుండా బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఎలాంటి లైనప్ ని సెట్ చేసుకుంటాడా అనే ప్రశ్నకి సాలిడ్ సమాధానమే ఇచ్చాడని చెప్పాలి.

తన నెక్స్ట్ సినిమా మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసి మరోసారి రోరింగ్ రెస్పాన్సుని అందుకున్నారు. మరి ఈ సినిమాని కూడా అదిరే క్యాస్టింగ్ తో సిద్ధం చేస్తున్న మేకర్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు బజ్ వినిపిస్తుంది.

మరి ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ భారీ మాస్ ప్రాజెక్ట్ ఈ జనవరి 21 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనిని కూడా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :