టాక్..అప్పుడే “బ్రహ్మస్త్ర” ఓటిటిలో వచ్చేయనుందా..?

Published on Sep 28, 2022 6:43 pm IST


బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు జంటగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “బ్రహ్మాస్త్ర” చిత్రం కోసం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర అయితే ఒక బిగ్గెస్ట్ విజువల్ వండర్ లా నిలిచింది. మరి వసూళ్ల పరంగా కూడా భారీ మొత్తంలోనే అందుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు థియేటర్స్ లో ప్రదర్శితం అవుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి అయితే లేటెస్ట్ టాక్ తెలుస్తుంది. ఈ చిత్రం అయితే అప్పుడే ఈ అక్టోబర్ లోనే స్ట్రీమింగ్ కి వచ్చేయనుందట. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో అయితే ఈ చిత్రం అక్టోబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :