‘ఛత్రపతి’ హిందీ రీమేక్ పై లేటెస్ట్ బజ్

Published on Feb 22, 2023 12:49 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శ్రియ శరణ్ హీరోయిన్ గా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2005లో తెరకెక్కిన మూవీ ఛత్రపతి. ఫామిలీ యాక్షన్ తో పాటు మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకుని హీరోగా ప్రభాస్ కి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. కాగా పదిహేడేళ్ల అనంతరం ప్రస్తుతం ఈ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ గ్రాండ్ గా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే.

పెన్ మూవీస్, పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ మూవీలో నుష్రత్ బరుచ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని రాబోయే సమ్మర్ లో రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై త్వరలో యూనిట్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్ రానునుందట. తనిష్క్ బాగ్చి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ పై అతి త్వరలో ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :