నాగ చైతన్య – సమంతల వివాహం జరిగేది ఎప్పుడంటే !

19th, April 2017 - 10:09:52 AM


ఈ ఏడాది జనవరి నెలలో వైభవంగా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య, సమంతలు వివాహం ఎప్పుడని మాటకి ఇన్నాళ్లు జవాబు చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు. వీరి వివాహం ఈ ఏడాది ద్వితీయార్థంలో జరుగుతుందని, అది కూడా హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాలు ప్రకారం రెండు సార్లు జరుగుతుందని వార్తలొచ్చాయి. ఈ వార్తతో అందరిలోనూ వీరి వివాహం పట్ల రెట్టింపు ఆసక్తి రేగింది.

తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరి వివాహం అక్టోబర్ నెలలో జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అక్కినేని కుటుంబం నుండి పూర్తి క్లారిటీ వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడానికి లేదు. మరోవైపు నాగ చైతన్య, సమంత, నాగార్జునలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరి ప్లానింగ్ ప్రకారం ఈ సినిమాలన్నీ ఆగష్టు నెలలో పూర్తయ్యే అవకాశముంది.