టాక్..”హను మాన్” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 10, 2023 10:12 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలీవుడ్ నుంచి కొత్త కొత్త సినిమాలు అందిస్తూ వస్తున్న యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఫస్ట్ సూపర్ హీరో చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. టీజర్ తో పాన్ ఇండియా లెవెల్లో గట్టి హైప్ ని అందుకున్న ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా అనేకమంది ఎదురు చూస్తున్నారు. మరి రీసెంట్ గానే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే ఈ కొత్త రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఆగస్ట్ రిలీజ్ కి లాక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దాదాపు ఆగష్టు మొదటి వారంలో అయితే రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా కె నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :