“హరిహర వీరమల్లు” షూట్ రీస్టార్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 7, 2021 6:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ఇప్పుడు స్వల్ప విరామంలో ఉంది. మరి ఆల్రెడీ సగానికి పైగా కంప్లీట్ అయ్యిన ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాదికి రిలీజ్ చెయ్యనున్నట్టుగా కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

అయితే మరి ఇప్పుడు ఈ సినిమా బ్యాలన్స్ షూట్ స్టార్టింగ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. బహుశా ఈ సినిమా షూట్ స్టార్ట్ అయితే వచ్చే అక్టోబర్ చివరి నాటి నుంచి కానీ అప్పుడు కుదరకుంటే నవంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ గ్యాప్ లో పవన్ “భీమ్లా నాయక్” ని కంప్లీట్ చేసేయనున్నారు. మరి వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :