టాక్..”మహేష్ 28″ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

టాక్..”మహేష్ 28″ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Nov 9, 2022 2:32 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ చిత్రం త్వరలోనే స్టార్ట్ చేసుకోనుంది. అయితే ఇప్పుడు తాజాగా సినిమా రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ప్రస్తుతం సినిమా షూట్ లేట్ గా స్టార్ట్ అవుతున్నందున మేకర్స్ చెప్పినట్టుగా సమ్మర్ లో అయితే సినిమా రిలీజ్ బహుశా ఉండకపోవచ్చనే తెలుస్తుంది. దీనితో సినిమా రిలీజ్ అంశం కాస్త వెనక్కి జరిగే ఛాన్స్ ఉందట. దీనితో అయితే ఈ చిత్రం అనుకున్న సమయానికి రాకపోవచ్చనే వినికిడి. ఇక ఈ భారీ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు