మహేష్, రాజమౌళి ల భారీ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Nov 19, 2021 7:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పుడు చేస్తున్న “సర్కారు వారి పాట” తర్వాత నుంచి మిగతా అన్ని సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పాలి. ఆల్రెడీ త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన హ్యాట్రిక్ సినిమాని మేకర్స్ భారీ లెవెల్లో ఆల్ మోస్ట్ పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది. ఇక దీని తర్వాత అసలైన భారీ చిత్రం రాజమౌళితో ఉంది.

ఇపుడు దీనిపైనే ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ నటుడు కీలక పాత్రలో నటించవచ్చని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ ప్రస్తుతానికి ఈ టాక్ అయితే బయటకి వచ్చింది. ఈ సినిమాపై ఆల్రెడీ చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లోనే ఉన్న ఈ చిత్రం మొదలవడానికి ఇంకా చాలా సమయం ఉంది.

సంబంధిత సమాచారం :

More