మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Nov 10, 2021 7:09 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో తీస్తున్న భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ చేయనున్నారు. మరి దీనిపై కూడా ఆల్రెడీ సాలీడ్ అంచనాలు ఉన్నాయి.

మాంచి యాక్షన్ డ్రామాగా దాదాపు పాన్ ఇండియన్ ఫ్లిక్ గా ఈ చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు దీనిపైనే లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా తాలూకా ప్రీ ప్రొడక్షన్ పనులు డిసెంబర్ నాటికి కంప్లీట్ కానున్నాయట. మరి అక్కడ నుంచి సర్కారు వారి పాట కంప్లీట్ అవ్వగానే కొత్త లుక్ సిద్ధం చేసి త్రివిక్రమ్ సినిమాలో మహేష్ జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాలో మరోసారి పుజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా థమన్ సంగీతం అందివ్వనున్నాడు.

సంబంధిత సమాచారం :