ఐకాన్ స్టార్ నుంచి కొత్త అనౌన్సమెంట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 18, 2022 8:30 pm IST


తన పుష్ప సినిమా సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్రాండ్ ని పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో వేశాడో తెలిసిందే. ఒక్కసారిగా మరింత క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇక్కడ నుంచి ఆల్ మోస్ట్ అన్నీ పాన్ ఇండియా సబ్జెక్టు లనే టచ్ చేయనున్నాడు. అంతేకాకుండా ఈ లైనప్ లో ఒకదాన్ని మించి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని తాను చేసే అవకాశం ఉందని క్రేజీ గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

అలా లేటెస్ట్ గా ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి పేరు కూడా తన లైనప్ పై వినిపించింది. ఇక ఇదిలా ఉండగా తన 22వ సినిమాకి సంబంధించి బిగ్ అనౌన్సమెంట్ ని ఇవ్వనున్నట్టు ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ రానున్న ఏప్రిల్ నెలలో ఈ భారీ అనౌన్సమెంట్ రాబోతుందట. మరి ఆ ఏ దర్శకుడుతో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి అదేంటో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :