పవన్ “భవదీయుడు భగత్ సింగ్” పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 11, 2022 10:30 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” ఇప్పుడు థియేటర్స్ లో మూడో వారం లోకి ఎంటర్ అయ్యి మంచి రన్ తోనే వెళుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత పవన్ మరో రీమేక్ టేకప్ చేస్తారని టాక్ ఉంది కానీ దానికి ముందు ఆల్రెడీ కమిట్ అయ్యిన సినిమాలపై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.

వాటిలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “భవదీయుడు భగత్ సింగ్” ఒకటి. వీరి కాంబో నుంచి అనౌన్స్ చేసిన రెండో సినిమా కావడంతో దీనిపై ఒక్కసారిగా భారీ హైప్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ సినిమాపై నే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో పవన్ ఒక ప్రొఫిసర్ గా కనిపిస్తారని ఇది వరకే టాక్ ఉండగా ఇపుడు అది దాదాపు నిజమే అని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదివ్వనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :