పవన్ “భవదీయుడు భగత్ సింగ్”పై లేటెస్ట్ బజ్.!

Published on Dec 1, 2021 9:34 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు రెండు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటి తర్వాత కూడా పవన్ కెరీర్ లో ఎప్పుడూ సెట్ చెయ్యాలని లైనప్ తో సన్నద్ధం అవుతున్నారు. మరి వాటిలో పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “భవదీయుడు భగత్ సింగ్”.

తన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో అనౌన్స్ చేసిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాపైనే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్ సినిమా కోసం హరీష్ శంకర్ లొకేషన్స్ వేటలో ఉన్నారట.

ఇక ఇవన్నీ ఫిక్స్ అయ్యాక కొంత కాలం తర్వాత రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :