పవన్ – సుజీత్ మాసివ్ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా మారిన బజ్.!

పవన్ – సుజీత్ మాసివ్ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా మారిన బజ్.!

Published on Jan 29, 2023 9:12 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సాలిడ్ సినిమాలు తన లైనప్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేస్తున్న చిత్రం కూడా ఒకటి. అయితే ఈ సినిమాపై అనౌన్స్ చేసిన రోజే భారీ అంచనాలు పోస్టర్ తో వచ్చేసాయి. మరి లేటెస్ట్ గా ఈ సినిమాపై సినీ వర్గాల్లో కొన్ని రూమర్స్ కూడా రాగా అవి ఆసక్తిగా మారాయి..

ఇక రేపు ఈ చిత్రం ముహూర్తం అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ కానుండగా ఆల్రెడీ సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ కాగా మరో ఆసక్తికర అప్డేట్ సినిమాపై వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నకి గాను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పేరు బయటకి రావడం జరిగింది. రీసెంట్ గా సుజీత్ అనిరుద్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయడంతో ఈ సినిమాకి అనిరుద్ లాక్ అయ్యి ఉండొచ్చు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు