“కల్కి” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్..

“కల్కి” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్..

Published on Jun 12, 2024 7:38 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెకెక్కించిన భారీ సై ఫై, మైథాలజీ డ్రామా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ తో మేకర్స్ ఆడియెన్స్ కి గట్టి ప్రామిస్ నే చేశారు. అయితే బుజ్జి, టీజర్, ట్రైలర్ ముచ్చట్లు అన్నీ అయ్యాయి.

ఇక ఇప్పుడు మంచి ఛిల్ మోడ్ లోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ క్రేజీ బీట్స్ ని సాంగ్ గా అందించినట్టుగా టాక్ ఉంది. మరి ఈ అవైటెడ్ సాంగ్ విషయంలో రేపే ఓ క్లారిటీ రానున్నట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీనితో కల్కి నుంచి మరో ట్రీట్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా దీపికా పదుకోణ్ సహా దిశా పటాని నటించింది. అలాగే వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు