ప్రభాస్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Jun 7, 2022 7:05 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ రెండు సాలిడ్ ప్రాజెక్టు లు “సలార్” అలాగే ప్రాజెక్ట్ కే లాంటి భారీ చిత్రాలు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ప్రభాస్ నుంచి సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో జస్ట్ టాక్ తోనే పాన్ ఇండియా వైడ్ సూపర్ సెన్సేషన్ ని రేపిన కాంబో ప్రభాస్ మరియు బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ దర్శకుడు సిద్ధార్త్ ఆనంద్ ల కాంబో.

గత కొంత కాలం కితం ఈ క్రేజీ కాంబో పై గాసిప్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమాపై మరింత క్లారిటీ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా అయితే ఉందట. అలాగే దాన్ని మైత్రి మూవీ మేకర్స్ తీయనుండగా ప్రభాస్ రీసెంట్ సినిమాల ట్రెండ్ బై లాంగువల్ గానే తెరకెక్కనుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :