“పుష్ప” మాస్ ఫీస్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jul 14, 2021 3:15 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలతో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

అయితే ఫస్ట్ పార్ట్ ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమాపై పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అలాగే ఫుల్ ఆల్బమ్ కోసం కూడా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపైనే గత కొంత కాలం నుంచి బజ్ నడుస్తుంది.

ఇప్పుడు కూడా తాజా టాక్ బయటకి వచ్చింది. బహుశా దీనిపై అప్డేట్ ఈ నెలాఖరులో వస్తుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాస్ ఫస్ట్ సింగిల్ ఆగష్టు నెలలో విడుదల అవ్వోచ్చేమో అని కూడా టాక్ నడుస్తుంది. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి దేవీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :