లేటెస్ట్ బజ్..”పుష్ప” మాస్ ట్రైలర్ కి టైం ఫిక్స్.?

Published on Nov 27, 2021 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తీస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు ఉన్న ఈ హై లెవెల్ మాస్ యాక్షన్ డ్రామా బన్నీ కెరీర్ లోనే ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా వస్తుంది. అయితే ఇక ప్రమోషన్స్ కి సంసిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ కి టైం ఫిక్స్ అయ్యిందట.

మరి ఈ మాస్ ట్రైలర్ మేకర్స్ వచ్చే డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారట. డేట్ పై ఇంకా క్లారిటీ లేదు కానీ వీకెండ్ లో ఏమన్నా రిలీజ్ చేస్తారో అనేది చూడాలి. ఇది చూస్తే సినిమాపై చాలా అంశాలు క్లారిటీ వస్తాయి అందుకే ఇది చాలా ఆసక్తిగా మారింది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :