బజ్..”పుష్ప 2″ కి భారీ స్థాయి బిజినెస్..?

Published on May 15, 2022 7:32 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక దీనితో నెక్స్ట్ తీయబోయే రెండో సినిమా “పుష్ప ది రూల్” పై అయితే పాన్ ఇండియా లెవెల్లో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది. పైగా ఇప్పుడు వస్తున్న సీక్వెల్ లు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవుతుండడంతో పుష్ప పార్ట్ 2 పై అనేక అంచనాలు సెట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు సినిమా భారీ స్థాయి బిజినెస్ పై లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ఆల్రెడీ 300 కోట్లకి పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను డీల్ వస్తున్నాయని బజ్ ఉండగా ఇప్పుడు అయితే మొత్తం అన్ని డీల్స్ కలుపుకొని అయితే 500 నుంచి 600 కోట్లకి పైగా బిజినెస్ ని ఈ సినిమా జరుపుకోనుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :